"శ్రీగురుపరంపరాభ్యాంనమః".
"నిరాకారపరబ్రహ్మ మానసపూజావిధానమ్"
ది. 22-7-2017న సన్మిత్రులు, శంకరాద్వైత వాంగ్మయపరిశోధకులు, జ్ఞానవృద్ధులైన శ్రీగణేశభట్టుగారు ఈదిగువతెల్పిన "నిరాకార పరబ్రహ్మ మానసపూజావిధానమును" మాయొక్క వాట్సప్ గ్రూపు "జ్ఞానయోగసాధన సభ" లో చదివినారు. అదివిని నేను చాల ఉద్వేగభరితుడనై, ఎలాగైనా దీనియొక్క అర్థమును, వివరణను, అందరికీ అందించాలని అనుకొన్నాను. నాకు అలవియైనంత మేరకు అందిస్తున్నాను. ఇందులో ఏవైన పొరపాట్లు న్నచో, నాఅజ్ఞానముగా భావించి మన్నించవలసినదిగాను, ఇందులోనున్న సద్వస్తువును ఈస్తొత్రకర్త యొక్క బ్రహ్మజ్ఞాన పరిపుష్ఠిగా భావించి స్వీకరించవలసినదిగా ప్రార్థించుచున్నాను.
అఖండేసచ్చిదానందే, నిర్వికల్పైకరూపిణే। స్థితేద్వితీయభావేస్మిన్, కథం పూజావిధీయతే॥
పూర్ణస్యావాహనంకుత్ర, సర్వాధారశ్చసాసనం। స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యంచ, శుద్ధస్యాచమనంకుతః॥
నిర్మలశ్చ కుతస్తానం, వస్త్రం విశ్వోదరశ్యచ। నిర్లేపశ్చ కుతోగంధః, పుష్పంనిర్వాసనస్యచ॥
నిర్విశేషస్య కాభూషా, కోలంకారో నిరాకృతేః। నిరంజనశ్చ కింధూపైః, దీపైర్వా సర్వసాక్షిణః॥
నిజానందైక తృప్తస్య, నైవేద్యంకిం భవేదిహ। విశ్వానందైతుష్టస్య, కింతాంబూలం ప్రకల్ప్యతే॥
స్వయంప్రకాశ చిద్రూపో, యోసావర్గాదిభాసకః। ప్రదక్షిణాశ్యనంతస్య, యద్వయస్యకుతోనపిః॥
వేదవాక్యైరవేద్యస్య, కుతస్తోత్రంవిధీయతే। స్వయంప్రకాశమానస్య, కుతోనీరాజనం విభోః॥
అంతర్బహిశ్చపూర్ణశ్చ, కథముద్వాసనం భవేత్। ఏవమేవ పరాపూజా, సర్వావస్తాసు సర్వదా॥
ఏతద్బుద్ధ్వాత్ దేవేశ, విధేయాబ్రహ్మవిత్తమైః॥
వివరణ
ఓనిరాకారపరబ్రహ్మా! నీవు అఖండమైన సచ్చిదానందరూపుడవు, ఎటువంటి వికల్పములు లేనివాడవు. అటువంటి అద్వైతరూపుడవైన నిన్ను, ద్వైతభావంతో నిండియున్ననేను ఏవిధంగా పూజింపగలను? నీవు అంతటా పూర్ణమై నిండియున్నవాడవు, ఎచటకు ఆవాహనం చేయగలను? అన్నింటికీ ఆధారమైనంటువంటి నీకు ఏ ఆసన మీయగలను? స్వచ్ఛమైన, శుద్ధమైనటువంటి నీకు ఏవిధమైన అర్ఘ్య, పాద్య, ఆచమనములీయగలను? నిర్మల మైన నీకు ఏవిధమైన స్నానం చేయించ గలను? విశ్వంభరుడవైన నీకు ఏ వస్త్రములీయగలను? ఎటువంటి లేపనము, అనగా ఆవరణ లేని నీకు ఏవిధముగా గంధమలరించగలను? ఎటువంటి వాసనలు లేనినీకు ఏ పుష్పములతో పూజించ గలను?ఏవిధముగానూ శేషములేని (శరీరములేని) నీకు ఏభూషణములలంకరించ గలను? నిరాకా రుడవైన నీకు ఏఅలంకారము చేయగలను? దేనిచేత రంజింపబడని నీకు ఏధూపము లీయ గలను? సర్వమునకు సాక్షివైన (అన్నింటినీ వీక్షించగల) నీకు ఏదీపము చూపించగలను? నిజానందములో (అఖండైకరసా నందములో) తృప్తిచెందునీకు ఏనైవేద్యములీయగలను? విశ్వముయొక్క ఆనందము లో తృప్తిచెందు నీకు ఏ తాంబూలము పరికల్పించగలను? స్వయంచిద్రూప ప్రకాశమానుడవు, ఖద్యోతా దులను (ఆకాశములోవుండు వాటిని) ప్రకాశింపజేయువాడవు, అవ్యయుడవు, అనంతుడవునగు నిన్ను ఏవిధముగా ప్రదక్షిణలు చేయగలను? వేదవాక్యములచే గూడ అవేద్యుడవైన నిన్ను ఏస్తోత్రము లచే నుతించగలను? స్వయంప్రకాశమాన్యుడవైన నీకు ఏ నీరాజనము లెత్తగల వాడను? లోపల, బయట, అంతటనూ నిండియున్న నిన్ను ఎచటకు ఉద్వాసన చేయగలను? ఇటువంటి బుద్ధిజనులు, బ్రహ్మవిదులు, ఇటువంటి పరాపూజను (నైరూప్యపూజను) సర్వావస్థలలోను, సర్వదా చేయుచుందురు. (పూర్తివివరణ ఆడియోక్లిప్ లో వినగలరని ప్రార్ధన).